ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Vellulla SRSP Car incident : ఎస్సారెస్పీ కాల్వలో పడిన కారు వెలికితీత.. - తెలంగాణ వార్తలు

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో.. ఓ కారు ప్రమాదవశాత్తూ కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు వెలికి తీశారు. మృతులు పూదరి రేవంత్‌, గుండవేని ప్రసాద్‌గా గుర్తించారు. మెట్‌పల్లి నుంచి ఆత్మకూరు వెళ్తున్న కారు.. వెల్లుల్ల శివారులో ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కాల్వలో పడింది.

Vellulla SRSP Car incident : ఎస్సారెస్పీ కాల్వలో పడిన కారు వెలికితీత..
Vellulla SRSP Car incident : ఎస్సారెస్పీ కాల్వలో పడిన కారు వెలికితీత..

By

Published : Jan 5, 2022, 3:34 PM IST

Vellulla SRSP Car incident : తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో.. ఎస్సారెస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరి మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. కొన్ని గంటలపాటు గాలించిన గజఈతగాళ్లు.. కారుతోపాటు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు.

Vellulla SRSP Car incident : ఎస్సారెస్పీ కాల్వలో పడిన కారు వెలికితీత..

ఏం జరిగింది?
జగిత్యాల జిల్లా ఎస్సారెస్పీ కాల్వలో పడిన కారును.. ఎట్టకేలకు వెలికితీశారు. అందులో ఉన్న ఇద్దరి మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు.. మృతులు పూదరి రేవంత్‌, గుండవేని ప్రసాద్‌గా గుర్తించారు. మెట్‌పల్లి నుంచి ఆత్మకూరు వెళ్తున్న కారు.. వెల్లుల్ల శివారులో ప్రమాదవశాత్తు ఎస్సారెస్పీ కాల్వలో పడింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. కారు కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. గజఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు క్రేన్‌ సాయంతో.. కారును బయటకు తీశారు.

ఇలా గుర్తించారు..!
వెల్లుల్ల శివారులోని ఎస్సారెస్పీ వంతెన వద్ద కాకతీయ కాల్వకు ఉన్న రెయిలింగ్‌ కూలిపోయింది. ఆ విషయం గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు వెల్లుల్ల రోడ్డులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అర్ధరాత్రి కారు వెళ్తున్నట్లు కనిపించింది. కానీ గ్రామం లోపల ఉన్న కెమెరాల్లో మాత్రం.. కారు వచ్చినట్లుగా సీసీ కెమెరాల్లో నిక్షిప్తంకాలేదు. కారు కాల్వలో పడినట్లు భావించారు. ఇదే సమయంలో మెట్‌పల్లికి చెందిన పూదరి రేవంత్, గుండవేని ప్రసాద్‌... మంగళవారం అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో.. కారు కాల్వలో పడినట్లు అనుమానించారు.

వెంటనే గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాలువకు నీటి సరఫరా నిలిపివేశారు. మూడు గంటలపాటు శ్రమించిన గజఈతగాళ్లు, పోలీసులు.. ఎట్టకేలకు ఇద్దరి మృతదేహాలు, కారును వెలికితీశారు.

ఇదీ చదవండి: Husband killed Wife: మద్యం మత్తులో భార్యను చంపేసి.. ఆపై..

ABOUT THE AUTHOR

...view details