రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే ప్రకటించాలంటూ రైతులు, మహిళలు 627వ రోజు ఆందోళనలు కొనసాగించారు. జిల్లాలోని తుళ్లూరు, మందడం, వెలగపూడి, కృష్ణాయపాలెం, దొండపాడు, అనంతవరం, ఉద్ధండరాయునిపాలెం, నెక్కల్లు గ్రామాల్లో రైతులు నిరసన దీక్షలు చేపట్టారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు.
పరిపాలనా రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ దొండపాడు వినాయకస్వామి ఆలయంలో రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మందడంలో మహిళలు మణిదీప వర్ణణ, లక్ష్మీ సహస్ర నామార్చన పూజలు చేశారు. రైతులకు మద్దతుగా 13 జిల్లాలోని ప్రజలు అండగా నిలవాలని కోరారు. రాష్ట్ర ప్రజల సహకారంతో.. ప్రభుత్వం మెడలు వంచి అమరావతిని సాధించుకుంటామని మహిళలు అన్నారు.