ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇంకా ఎన్ని కమిటీలు వేస్తారు? మీకు చట్టాలు తెలియవా?' - 11వ రోజుకు చేరిన నిరసనలు

రాజధాని పరిధిలోని రైతులు.. ఆందోళనల నుంచి వెనక్కి తగ్గడం లేదు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పేంత వరకూ నిరసన ఆపేది లేదని తేల్చి చెబుతున్నారు.

Capital region farmers protests reached 11th day
Capital region farmers protests reached 11th day

By

Published : Dec 28, 2019, 10:08 AM IST

Updated : Dec 28, 2019, 10:56 AM IST

తుళ్లూరులో 11వ రోజుకు చేరిన నిరసనలు

రాజధాని మంటలు చల్లారడం లేదు. అమరావతి పరిధిలోని తుళ్లూరులో... పదకొండో రోజూ ఉద్ధృతంగా రైతులు, ప్రజల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరో కమిటీ వేస్తారన్న వార్తలపై.. ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 29 గ్రామాల ప్రజలతో జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ఇచ్చిన గెజిట్ లోనూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి.. అని ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. అయినా.. ఇంకా ఎన్ని కమిటీలు వేస్తారని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పోరాటాన్ని ఆపేది లేదని.. ఆంధ్రప్రదేశ్ కు రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని డిమాండ్ చేశారు. చట్టాలు తెలుసుకుని నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు. తమ త్యాగాలకు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు ఇదేనా అని నిలదీశారు.

Last Updated : Dec 28, 2019, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details