అమరావతి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాజధాని ఐక్యకార్యాచరణ సమితి నేతలు నిర్ణయించారు. అమరావతి ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామని ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ వెలగపూడిలో తెలిపారు. ఇప్పటికే జాతీయ స్థాయి రైతు సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు నిర్వహించామన్నారు. ఉద్యమ గీతాలతో ఆదివారం సాయంత్రం తుళ్లూరులో ధూంధాం ఏర్పాటు చేశామని చెప్పారు. ఉద్యమాన్ని 13 జిల్లాలకు విస్తరించేందుకు సాంస్కృతిక చైతన్య వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు సుధాకర్ వెల్లడించారు.
ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం: సుధాకర్ - Amaravathi farmers agitation News
ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రాజధాని ఐక్యకార్యాచరణ సమితి నేతలు సంకల్పించారు. 13 జిల్లాలకు విస్తరించేందుకు సాంస్కృతిక చైతన్య వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ఐకాస నేత సుధాకర్ వెల్లడించారు.
సుధాకర్