ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్రమంత్రి కిషన్​రెడ్డి కాళ్లు మెుక్కిన రాజధాని రైతులు - three capitals for AP news

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డిని అమరావతి రైతులు హైదరాబాద్​లో కలిశారు.  రైతులకు అండగా నిలవాలని, అన్యాయం జరగకుండా చూడాలని పలువురు మహిళలు ఆయన కాళ్లపై పడ్డారు.

capital-formers-meet-home-minister-kishan-reddy-at-hyd
capital-formers-meet-home-minister-kishan-reddy-at-hyd

By

Published : Jan 5, 2020, 4:42 PM IST

రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి: కిషన్ రెడ్డి

హైదరాబాద్​లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డిని అమరావతి రైతులు కలిశారు. రాజధాని రైతులకు అన్యాయం చేయకుండా చూడాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్ కోసం భూములిచ్చిన తమని.. పెయిడ్ ఆర్టిస్టు​లుగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భూములివ్వటం తాము చేసిన తప్పా ..? అని కన్నీటి పర్యంతమయ్యారు. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి...రైతులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమైనప్పటికీ.. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. రైతులకు సర్ది చెప్పి విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయంతో వస్తే.. కేంద్రం జోక్యం చేసుకుంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details