రాజధాని అభివృద్ధి కోసం నమ్మి భూములిస్తే.. ప్రభుత్వం విధ్వంసకర పాలన సాగిస్తోందని మహిళా రైతులు విమర్శించారు. అమరావతి రైతుల పోరాటం 384వ రోజుకు చేరుకుంది. ప్రజావేదిక కూల్చినప్పుడే జనం తిరగబడి ఉంటే.. ఇప్పుడు ఆలయాలు ధ్వంసం చేసే పరిస్థితి తలెత్తేది కాదని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో ప్రజల నెత్తిన అప్పు పెట్టటం మినహా.. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదని ఆరోపించారు. రాజధాని నిర్మాణం పూర్తై ఉంటే ఎందరికో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వచ్చేవని అభిప్రాయపడ్డారు.
జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలను తమ పోరాటం ద్వారా అడ్డుకుంటామన్నారు. న్యాయం అమరావతి రైతుల వైపే ఉందని.. కోర్టులో తప్పక విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.