61వ రోజుకు చేరిన రాజధాని రైతుల ఆందోళనలు
అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలు 61వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ మందడం, తుళ్లూరులో రైతులు ధర్నా చేపట్టనున్నారు. వెలగపూడిలో 61వ రోజు రైతులు, మహిళల రిలే దీక్షలు కొనసాగనున్నాయి. కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఇతర గ్రామాల్లో రైతులు ఆందోళనలు చేయనున్నారు.
capital farmers protest day 61