ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతీ.. ఈ ఆందోళనలు ఆగేదెన్నడు..? - amravthi farmers protests

రాష్ట్ర రాజధానిగా అమరావతే ఉండాలని రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. తమ భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని రాజధాని నిర్మాణానికి భూములు త్యాగం చేస్తే ప్రభుత్వం వేదనకు గురి చేస్తోందని అన్నదాతలు మండిపడ్డారు. అమరావతిపై ఆందోళనతో రోడ్డున పడ్డామని వాపోయారు. సర్కారు మూడు రాజధానుల ప్రకటనను వెనక్కు తీసుకునే వరకూ నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు.

అమరావతీ.. ఈ ఆందోళనలు ఆగేదెన్నడు..?
అమరావతీ.. ఈ ఆందోళనలు ఆగేదెన్నడు..?

By

Published : Dec 25, 2019, 4:35 AM IST

అమరావతిలో కొనసాగుతోన్న రైతుల ఆందోళనలు

అమరావతి రైతుల నిరసనలు నేటితో 8వ రోజుకు చేరుకున్నాయి. ఇవాళ వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగనుండగా.. తుళ్లూరు, మందడంలో మహాధర్నాలు నిర్వహించనున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ వివిధ ప్రజాసంఘాలు ఆందోళన చేపట్టనున్నాయి.

రెచ్చగొడుతున్నారు

తాము వారం రోజులుగా ఉద్ధృతంగా తమ నిరసన తెలియచేస్తున్నా.. రాజధాని ప్రాంత ప్రజా ప్రతినిధులు కనీసం పరామర్శకైనా రాకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలకులే తమను రెచ్చగొడుతూ ఎప్పుడూ వాడని భాష వాడేలా చేస్తున్నారని మండిపడ్డారు.

కేబినెట్​ భేటీ ఎక్కడ..?

ఆందోళనల నేపథ్యంలో 27న జరగాల్సిన కేబినెట్‌ భేటీ... అమరావతిలోనే జరుగుతుందా లేదా వేదిక మారే అవకాశాలున్నాయా అన్న అంశంపై రైతులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ రాజధానిలోనే మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తే అమాత్యులకు తమ నిరసనను గట్టిగా తెలుపుతామని అన్నదాతలు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

సచివాలయం పూర్తిగా విశాఖలో పెడితే ఒప్పుకోం: టీజీ వెంకటేశ్

ABOUT THE AUTHOR

...view details