3 రాజధానులపై రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని రాజధాని రైతులు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. రాజధాని ప్రాంతంలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మోదీకి తెలిపేందుకు.. అమరావతి ఐకాసా ఆధ్వర్యంలో 16 మంది రాజధాని రైతులు గన్నవరం విమానాశ్రయం నుండి దిల్లీకి పయనమయ్యారు. దిల్లీ పెద్దలను కలిసి అమరావతి వాణిని వినిపించనున్నట్లు తెలిపారు.
'మోదీని కలిసేందుకు పయనమైన రాజధాని రైతులు' - దిల్లీలో రాజధాని రైతులు తాజా వార్తలు
ప్రధాని మోదీని కలిసేందుకు రాజధాని రైతులు దిల్లీ బయల్దేరారు. అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో హస్తినకు 16మంది రైతులు పయనమయ్యారు.
capital-farmers-going-to-delhi-to-meet-prime-minister-modi