ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమరావతిపై కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు' - భూ కంపంపై అమరావతి జేఏసీ కామెంట్స్

రాజధాని ప్రాంతంలో పేళుళ్లతో వచ్చిన ప్రకంపనలను... భూకంపం వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేశారని అమరావతి ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ సుధాకర్ ఆరోపించారు. కొంత మంది అమరావతిపై విషప్రచారం చేస్తున్నారని దీనిని వెంటనే మానుకోవాలని హితవు పలికారు.

capital amaravathi jac on blast
capital amaravathi jac on blast

By

Published : Feb 28, 2021, 3:54 PM IST

అమరావతిని ఇప్పటికే కొంత మంది ఎడారి అని, శ్మశానం అంటూ, మునక ప్రాంతమని తప్పుడు ప్రచారాలు చేశారని... అమరావతి ఐక్యకార్యాచరణ సమితి కన్వీనర్ సుధాకర్ పేర్కొన్నారు. ఎన్జీఆర్ఐ నుంచి ఎలాంటి సమాచారం లేకపోయినా భూకంపం వచ్చిందంటూ తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా.. అభివృద్ధి పేరుతో 3 వేల కోట్లు కేటాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని సుధాకర్ చెప్పారు. విస్ఫోటనం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజధానిలో ముందు ఏ పనులు ప్రారంభిస్తున్నారు? ఏఎంఆర్​డీఏ పేరుతో సీఆర్​డీఏ నిధులు ఏ విధంగా సేకరిస్తున్నారో రాజధానిలో సహ భాగస్తులమైన తమకు తెలిపాలని కమిషనర్ ను కోరారు. వారంలో దీనిపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని లేకపోతే రాజధాని గ్రామాల్లోని 29 వేల మంది ప్రజలు సీఆర్డీయే కార్యాలయం దగ్గరికి వస్తామని సుధాకర్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details