Minister Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడంవల్ల పనుల్లో పురోగతి లేదని, అందుకే గడువు తేదీని ప్రకటించలేమని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డయాఫ్రం ఎంత మేర దెబ్బతిందనే విషయాన్ని నేషనల్ హైడల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) పరీక్షలు జరిపి తేల్చేవరకూ అక్కడ పనులు చేయడానికి అవకాశం లేదని వివరించారు. పరీక్షించాలంటే వరద తగ్గాలనీ, ఆచరణలోనూ కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపారు. చంద్రబాబు తప్పిదంవల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఆరోపించారు. ‘ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో పనులు కుంటుపడ్డాయే తప్ప.. చంద్రబాబు చెబుతున్నట్లు సర్వనాశనం కాలేదు. డయాఫ్రం వాల్ దెబ్బతిందని ఎన్‌హెచ్‌పీసీ నిర్ధారిస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీలకు సవరించిన అంచనా వ్యయం రూ.610 కోట్లు కాగా.. తెదేపా హయాంలో కేవలం రూ.157.55 కోట్లే ఖర్చు చేశారు. దీన్ని బట్టే ఎవరి హయాంలో ప్రాజెక్టు పూర్తి చేశారో అర్థం చేసుకోవచ్చు’ అని మంత్రి పేర్కొన్నారు.
Ap polavaram project: ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం: మంత్రి అంబటి రాంబాబు
Polavaram project : పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని జల వనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బతినడంవల్ల పనుల్లో పురోగతి లేదని, అందుకే గడువు తేదీని ప్రకటించలేమని స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేం: మంత్రి అంబటి రాంబాబు
* సాగునీటి ప్రాజెక్టుల గేట్లు తరచూ కొట్టుకుపోవటంపై విలేకరులు మంత్రిని ప్రశ్నించగా.. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే గేట్లు తుప్పు పట్టడం మొదలైందా? అంతకు ముందు తుప్పే పట్టలేదా? అని ఎదురు ప్రశ్నించారు.
ఇవీ చదవండి: