రాష్ట్ర హోంశాఖ పరిధిలోని కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాల్లో ప్రతిభావంతుల జాబితా కోసం అభ్యర్థులకు నిరీక్షణ తప్పడం లేదు. సివిల్, ఏఆర్, ఎపీఎస్పీ విభాగాల్లో కానిస్టేబుల్, అగ్నిమాపక శాఖలో ఫైర్ మెన్, జైళ్ల శాఖలో వార్డరు పోస్టుల భర్తీ కోసం కొన్ని నెలల క్రితం తుది పరీక్ష నిర్వహించారు. వీటి ఫలితాలు విడుదలై 22 రోజులు గడుస్తున్నా నేటీకీ ప్రతిభావంతుల జాబితా విడుదల కాకపోవడంపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఆయా విభాగాల్లో 2 వేల 723 పోస్టుల భర్తీకి నిర్వహించిన తుది రాతపరీక్షకు 64 వేల 575 మంది హాజరు కాగా.. 58 వేల ఏడుగురు అర్హత సాధించారు. సగటున ఒక్కో పోస్టుకు 21 మంది వరకూ పోటీపడుతున్నారు. వీరిలో అత్యధిక మార్కులు సాధించిన వారు.. వారికి వర్తించే రిజర్వేషన్.. ఆ విభాగానికి కేటాయించిన పోస్టులు.. తదితర అంశాల ఆధారంగా ప్రతిభావంతుల జాబితా రూపొందిస్తారు. నోటిఫికేషన్ విడుదలై 10 నెలలు అవుతోందని, వెంటనే జాబితా విడుదల చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
ప్రకటించని ప్రతిభావంతుల జాబితా... పోలీస్ ఉద్యోగార్థుల్లో ఆందోళన - merit
రాష్ట్ర హోంశాఖ పరిధిలోని కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి ప్రతిభావంతుల జాబితా కోసం అభ్యర్థులకు నిరీక్షణ కొనసాగుతోంది. వీటి పరీక్షా ఫలితాలు విడుదలై 22 రోజులు గడుస్తున్నా నేటీకీ ప్రతిభావంతుల జాబితా విడుదల కాకపోవటంపై అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది.
హోంశాఖ ఉద్యోగాల్లో ప్రతిభావంతుల జాబితా కోసం తప్పని నిరీక్షణ