గులాబ్ తుపాను ప్రభావంతో రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసింది. అంతేకాకుండా కొన్ని రైళ్ల మార్గాలను కుదించడం, మరికొన్నింటి రైళ్ల దారి మళ్లించి నడుపుతున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈ నెల 26న విశాఖ- విజయవాడ వైపు వెళ్లే 10 రైళ్లు, విశాఖ- జయనగరం వైపు నడిచే మరో 6 రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు. 27న విశాఖ మీదుగా రాకపోకలు సాగించే 6 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.
ఈ నెల 26న పూరీ-ఓఖా ప్రత్యేక రైలును వయా ఖుర్థారోడ్, అంగూల్, సంబల్‌పూర్ మీదుగా దారి మల్లించినట్లు ఎ.కె.త్రిపాఠి పేర్కొన్నారు. 27న విశాఖలో బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్రత్యేక రైలును జగదల్‌పూర్‌లో నిలిపేయడంతోపాటు తిరుగు ప్రయాణంలో ఈనెల 28న జగదల్‌పూర్ నుంచి బయలు దేరుతుందన్నారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి కోరారు.