ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"'పది' ర్యాంకుల ప్రచారం ఆపేయండి.. సర్కారు ఆదేశం" - ఏపీలో పదో తరగతి ర్యాంకుల ప్రచారం నిషేధించిన ప్రభుత్వం

Tenth ranks: "పదిలో మొదటి ఆరు ర్యాంకులు మావే.. 9 ర్యాంకులు మావే" అంటూ టీవీల్లో ఊదరొట్టే ప్రకటనలు విన్నారా..? "వినీ.. వినీ చెవులు చిల్లులు పడ్డాయి" అంటారా! ఇక నుంచి ఆ గోల తప్పినట్టే! అవును.. ఆ ప్రకటనలు వార్తా పత్రికల్లో కనిపించవు.. టీవీల్లో వినిపించవు..! ఎందుకంటే..?

tenth ranks
పది ర్యాంకుల ప్రచారం నిషిద్ధం

By

Published : Jun 2, 2022, 8:05 AM IST

Tenth ranks: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని.. విద్యా సంస్థలను ఆదేశిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ర్యాంకుల పేరుతో జరిగే ప్రచారం వాస్తవాలను మభ్యపెట్టేలా ఉంటోందంటూ విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీచేసింది. తప్పుడు ప్రచారం చేసినట్లు తేలితే సంబంధితులకు మూడేళ్లకు తగ్గకుండా ఏడేళ్ల వరకు జైలుశిక్షను విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అలాగే రూ.లక్ష వరకు జరిమానా విధించే అధికారం కూడా ఉందని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details