ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు: తెదేపా - Kala Venkata Rao

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కళా వెంకటరావుని అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడాన్ని తెదేపా నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌లా అమలు చేయకుండా ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని... అందుకే తెలుగుదేశం నేతలపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు.

Calling for fundamental rights: TDP
ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు: తెదేపా

By

Published : Jan 21, 2021, 5:18 AM IST

ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు: తెదేపా

శ్రీకాకుళం జిల్లా రాజాంలో కళా వెంకట్రావుని అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడాన్ని తెలుగుదేశం నేతల తీవ్రంగా ఖండించారు. కళా వెంకట్రావు అరెస్టు ఆటవిక చర్య అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఏం నేరం చేశారని అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారని నిలదీసిన చంద్రబాబు... సీఎం జగన్‌ ఉన్మాదం పరాకాష్టకు చేరిందని ధ్వజమెత్తారు.

అత్యంత సౌమ్యుడైన కళాను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని... తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆక్షేపించారు. 300 మంది పోలీసులతో ఉగ్రవాదుల తరహాలో అదుపులోకి తీసుకోవడం సిగ్గుచేటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

కళా వెంక‌ట్రావుని అర్ధరాత్రి అదుపులోకి తీసుకోవడాన్ని తెలుగుదేశం నేతలు అయ్యన్నపాత్రుడు, అమర్‌నాథ్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, నక్కా ఆనందబాబు, జవహర్‌, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి, దేవినేని ఉమా, కూన రవికుమార్‌ ఖండించారు. వైకాపాకు రోజులు దగ్గర పడ్డాయని.. అందుకే తెదేపా నేతలపై అక్రమ కేసులు బనాయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండీ... కళా వెంకటరావును అదుపులోకి తీసుకుని వదిలేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details