రాష్ట్రమంతా ఒక్కటై అమరావతి కోసం పోరాడాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధానిని కాపాడుకోవడం రాష్ట్రప్రజలగా అందరి బాధ్యతని స్పష్టం చేశారు. ఇది చారిత్రాత్మక అవసరమని పేర్కొన్నారు. భూములు త్యాగం చేసిన రైతులకు చేస్తోన్న నమ్మకద్రోహాన్ని ప్రశ్నించకపొతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు.
రాజధాని అమరావతి పరిరక్షణ కోసం ప్రజలు చేస్తోన్న ఉద్యమo 300 రోజులకు చేరిందని గుర్తు చేసిన చంద్రబాబు... ఇందులో 92 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను గుర్తించడంలేదని మండిపడ్డారు. అమరావతి అనేది 5 కోట్ల ఆంధ్రుల ఉజ్వల భవిష్యత్తుకు ఆయువుపట్టని తేల్చిచెప్పారు.
మనసున్న వాడికే రైతు కష్టం తెలుస్తోంది: లోకేశ్