ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాపై ఐదుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు - ఏపీ కేబినెట్ సబ్ కమిటీ

కరోనాను కట్టడి చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఉపసంఘానికి కన్వీనర్​గా వ్యవహరించనున్నారు.

ap minister sub cabinet
కరోనాపై ఐదుగురు మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు

By

Published : Apr 20, 2021, 1:40 AM IST

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఐదుగురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్​గా ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. హోంమంత్రి మేకతోటి సుచరిత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సభ్యులుగా ఈ కమిటీని నియమించారు. ఈ మేరకు సీఎస్ అదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కట్టడికి ఇప్పటికే కీలకమైన అధికారులతో కొవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం కమాండ్ కంట్రోల్ సెంటర్​కు కావలిసిన సలహాలు, సూచనలను ఇవ్వనుంది.

ABOUT THE AUTHOR

...view details