ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనాపై పర్యవేక్షణ కమిటీ: మంత్రివర్గం ఆమోదం - corona latest news in ap

కరోనాపై పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనా నివారణ చర్యలపై ఐదుగురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ వేసింది. మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబుతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

cabinet sub committee formed on corona spread lock in ap
కరోనాపై పర్యవేక్షణ కమిటీ: మంత్రివర్గం ఆమోదం

By

Published : Mar 27, 2020, 3:39 PM IST

కరోనాపై పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కరోనా నివారణ చర్యలపై ఐదుగురు మంత్రులతో ప్రభుత్వం కమిటీ వేసింది. మంత్రులు ఆళ్ల నాని, బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబుతో కమిటీ ఏర్పాటు కానుంది. నిత్యం వైద్యశాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సూచించారు. కరోనా నివారణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘానికి అధికారులు వివరించారు. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై జిల్లాకు రూ.2 కోట్లు కేటాయించారు.

రాష్ట్రంలో ఆర్థిక ప్రగతి కుదేలైందని మంత్రివర్గం అభిప్రాయపడింది. దేశానికి, రాష్ట్రాలకూ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగిలిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కరోనా నిరోధక చర్యలపై ఖర్చుకు వెనుకాడవద్దని సీఎం జగన్‌ సూచించారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిపైనా మంత్రివర్గం చర్చించింది. వసతి, భోజనం కల్పించేలా ఆయా రాష్ట్రాలతో మాట్లాడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆయా రాష్ట్రాలు ముందుకురాకుంటే వసతి ఖర్చు భరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. యాచకులు, అనాథలకు వసతి కల్పించాలని, కల్యాణమండపాల్లో భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఇదీ చదవండీ... 'క్వారంటైన్‌కు సిద్ధమైతేనే రాష్ట్రంలోకి అనుమతిస్తాం'

ABOUT THE AUTHOR

...view details