కొవిడ్ పరిస్థితులపై దిల్లీ నుంచి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కోవిడ్ పరిస్థితులపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ సమీక్షించారు. 8 రాష్ట్రాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని రాజీవ్ గౌబ తెలిపారు. రాష్ట్రాలలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సూచించారు.
'వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి' - ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్ వార్తలు
వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్నారు. కోవిడ్ పరిస్థితులపై దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
!['వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయండి' Cabinet Secretary Rajiv Gowda video conference with Chief Secretaries of Government of various states](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11250053-821-11250053-1617350008083.jpg)
కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ
టెస్టింగ్, కంటైన్మెంట్ చర్యలు పటిష్టంగా చేపట్టడంతోపాటు.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కేబినెట్ కార్యదర్శి సీఎస్‌లను ఆదేశించారు. 45 ఏళ్లు నిండిన వారందరికీ వారికి వ్యాక్సిన్ అందించాలని సూచించారు. దేశవ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 81వేల కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకరంగా ఉందన్నారు. విజయవాడ సీఎస్ క్యాంపు కార్యాలయం నుంచి సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాథ్‌దాస్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు.
TAGGED:
covid vaccination