ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టుపై కేంద్ర కార్యదర్శి ఆరా - Kadapa-Bangalore railway project news

రైల్వే పెండింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ... వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఏపీకి చెందిన కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టుపై చర్చించారు.

Cabinet Secretary Rajiv Gauba Review on pending Railway Projects
సీఎస్​లతో కేబినెట్ కార్యదర్శి సమావేశం

By

Published : Feb 12, 2021, 7:21 PM IST

ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ అంశాలపై దిల్లీ నుంచి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఏపీకి చెందిన పెండింగ్ ప్రాజెక్టు కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని50:50 నిష్పత్తిలో భరించేందుకు కుదిరిన ఒప్పందంపై కేంద్ర కార్యదర్శి ఆరా తీశారు. దీనిపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం, రైల్వేశాఖ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని... దీని ప్రకారం పనులు వేగవంతం చేయాలని కేంద్ర కేబినెట్ కార్యదర్శి సూచించారు.

దేశంలో రైల్వే ప్రాజెక్టులన్నీ ఈ విధానంలోనే చేపడుతున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మారుమూల ప్రాంతాల వారికి రైల్వే కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు కడప-బెంగళూర్ రైల్వే ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ.. విభజన కారణంగా ఏపీ తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉందని... ప్రస్తుతం ఈ ప్రాజెక్టులోని భూసేకరణలో మాత్రమే 50 శాతం వ్యయాన్ని భరించగలుగుతామని సీఎస్ తెలిపారు. మిగతా మొత్తాన్ని రైల్వే శాఖ భరించేలా చూడాల్సిందిగా సీఎస్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details