ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jagan Cabinet Decisions: విద్యార్థులకు ల్యాప్​టాప్​లు.. ఇళ్ల నిర్మాణాలకు భారీగా నిధులు! - ఏపీ మంత్రి వర్గ నిర్ణయాలు తాజా

cabinet-meeting
cabinet-meeting

By

Published : Jun 30, 2021, 1:48 PM IST

Updated : Jun 30, 2021, 2:28 PM IST

13:46 June 30

మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

మంత్రివర్గ నిర్ణయాలు

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆ నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

  • రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మొబైల్ వెటర్నరీ అంబులెన్స్​ల కొనుగోలు
  • నవరత్నాల్లో భాగంగా 28 లక్షల ఇళ్ల నిర్మాణం కోసం త్వరలో భారీ ప్రచార కార్యక్రమం
  • 9 నుంచి 12 తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ల్యాప్​టాప్​ల పంపిణీ
  • ప్రకాశం జిల్లా సంతనూతలపాడు పేర్నమెట్ట గ్రామంలో ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటు
  • విజయనగరంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్పు

మరిన్ని నిర్ణయాల్లో భాగంగా....

జేఎన్టీయూ చట్టం 2008 సవరణకు మంత్రివర్గం అంగీకారాన్ని తెలిపింది. టిడ్ కో ద్వారా 2 లక్షల,62, 216 ఇళ్ల నిర్మాణం పూర్తికి, మౌళిక సదుపాయల కల్పన కోసం, రూ. 5990 కోట్ల మేర బ్యాంకు రుణానికి హామీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2021-24 ఐటీ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుకు మారిటైమ్ బోర్డుతో సంయుక్తంగా కార్యకలాపాల నిర్వహణకు అనుమతించింది. రీ సర్వే లో పట్టదారులకు ధృవపత్రాలు జారీ చేసేందుకు ఏపీ భూమీ హక్కు చట్ట సవరణకు ఆమోదంతెలిపింది.

విశాఖ నక్కపల్లి వద్ద హెట్రో డ్రగ్స్ సెజ్​కు ఎకరా 25 లక్షల చొప్పున 81 ఎకరాల కేటాయించేందుకు కేబినేట్‌ అంగీకారాన్ని తెలిపింది. 864 కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి పధకంలో పుట్టపర్తి నియోజక వర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు మొదటి దశ కింద ఎత్తిపోతల, గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు కేబినేట్‌ అంగీకారాన్ని తెలిపింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు.. 539 కొత్త 104 వాహనాలను కొనుగోలుకు రూ. 90 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు, సత్యనారాయణ పురం, మాచవరం పరిధిలోని కొన్ని ప్రాంతాలను కొత్త పోలీస్ స్టేషన్ పరిధిలో చేర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇదీ చదవండి:

brahmamagari pitham: బ్రహ్మంగారి పీఠంపై తెగని పంచాయితీ.. హైకోర్టుకు చేరిన వివాదం!

Last Updated : Jun 30, 2021, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details