సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు మంత్రి మండలి భేటీ కానుంది. రాష్ట్రంలో వరద పరిస్థితులు, ప్రత్యేకించి గోదావరి జిల్లాల్లో ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు, తక్షణ ఆర్థిక సాయం ప్రకటన, అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించే అంశాలపైనా కేబినెట్లో చర్చించనున్నట్టు సమాచారం. ఇటీవల మంత్రివర్గంలోకి ఇద్దరు చేరడం, ధర్మాన కృష్ణదాస్కి ఉపముఖ్యమంత్రి హోదా కల్పించడంతో మంత్రులు కూర్చునే స్థానాల్లో మార్పులు జరిగాయి.
ఇవాళ కేబినెట్ భేటీ.. మంత్రుల సీట్లలో మార్పులు - వరద పరిస్థితులపై కేబినెట్ భేటీ న్యూస్
ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. వరద పరిస్థితులు, తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. మరోవైపు మంత్రులు కూర్చునే స్థానాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
cabinet meet today on godavari floods