ఈనెల 30న రాష్ట్రమంత్రివర్గ సమావేశం - ap cabinet meet on octomber 30th
ఈనెల అక్టోబరు 30 వ రాష్ట్రమంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Cabinet meet on octomber 30th
ఈ నెలాఖరులో మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబర్ 30వ తేదీన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహించేందుకు సాధారణ పరిపాలన శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో సీఎం జగన్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు నవంబర్ నుంచి ప్రతి నెల రెండు, నాల్గవ బుధవారాల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సర్క్యూలర్ జారీ చేశారు.