ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు రాష్ట్ర మంత్రి వర్గ భేటీ... చర్చకు కీలకాంశాలు - మంత్రి వర్గ సమావేశం వార్తలు

రాష్ట్రంలో అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలకు వేర్వేరుగా ప్రత్యేక కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.  రేషన్ కార్డు తరహాలోనే ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, పింఛను కార్డు, ఫీజు రీఎంబర్స్​మెంట్ కార్డులను జారీ చేసే అంశంపై నేడు రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలోని కొన్ని మైనింగ్ లీజుల రద్దు.. కేబినెట్​లో చర్చకు వచ్చే అవకాశముంది. కాపు మహిళలకు వైఎస్సార్ కాపునేస్తం పేరిట ఆర్థిక సాయం అందించే అంశం మంత్రివర్గంలో చర్చించనున్నారు.

cabinet meet on key policies
నేడు రాష్ట్ర మంత్రి వర్గ భేటీ... చర్చకు కీలకాంశాలు

By

Published : Nov 27, 2019, 6:12 AM IST

నేడు రాష్ట్ర మంత్రి వర్గ భేటీ... చర్చకు కీలకాంశాలు

సచివాలయంలో నేడు రాష్ట్రమంత్రివర్గం భేటీకానుంది. ప్రభుత్వ ప్రవేశపెట్టిన సంక్షేమపథకాలకు వేర్వేరు కార్డుల జారీ సహా వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఆరోగ్య శ్రీ కార్డు , రేషన్ కార్డు, ఫీజు రీఎంబర్స్​మెంట్ కార్డు, పింఛను కార్డుల పేరిట నాలుగు వేర్వేరు సంక్షేమ పథకాల కార్డులు జారీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే నిర్ణయించారు. ఈ విషయంపై కేబినెట్ ఆమోదం తర్వాత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది.

యాజమాన్య హక్కుల చట్ట సవరణపై చర్చ

అసైన్డు భూములను ప్రభుత్వ అవసరాల కోసం తిరిగి తీసుకుంటే భూమి విలువపై 10శాతం పరిహారం చెల్లించే అంశంపైనా మంత్రివర్గంలో చర్చించనున్నారు. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్​కు భూకేటాయింపులపైనా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పేదలకిచ్చే భూములపై యాజమాన్య హక్కులకు సంబంధించిన చట్ట సవరణపై మంత్రివర్గం చర్చించనుంది. ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన భూములను విక్రయించే హక్కును 20 సంవత్సరాల నుంచి 5 ఏళ్లకు తగ్గించే ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

వైఎస్సార్ కాపు నేస్తంపై చర్చ

ఉగాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఉచితంగా ఇచ్చే 25 లక్షల ఇళ్ల స్థలాల విషయంలో సూచనలు, సలహాలు ఆహ్వానించే అంశంపై కేబినెట్​లో చర్చించనున్నారు. మద్యం విక్రయాలపై వసూలు చేస్తున్న అదనపు పన్నుని ముసాయిదా బిల్లుగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే అంశంపైనా కేబినెట్ తీర్మానించే అవకాశముంది. రాష్ట్రంలోని వివిధ మైనింగ్ లీజులను రద్దు ప్రతిపాదనపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాపు మహిళలకు వైఎస్సార్ కాపు నేస్తం పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించే అంశంపై కూడా కేబినెట్​కు ప్రతిపాదనలు అందాయి.

కడప స్టీల్ ప్లాంట్ మౌలికాంశాలపై చర్చ

జగనన్న విద్యాదీవెన పథకాన్ని ఆమోదించనున్న మంత్రి మండలి.. జగనన్న వసతి దీవెన పథకం కింద హాస్టళ్లల్లో సౌకర్యాల పెంపు ప్రతిపాదనలపై చర్చించనుంది. కడప స్టీల్ ప్లాంట్​కు డిసెంబరు 26న ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో... భూ కేటాయింపులు, నీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన అంశంపై మంత్రిమండలి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్టు బోర్డు సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంపుపై కేబినెట్​లో రాటిఫికేషన్ చేయనున్నారు. రాష్ట్రంలోని ఓడరేవుల్లో టెక్నికల్ ఆడిట్ నిర్వహణకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలపనుంది.

ఇదీ చదవండి :

'ఏం చేశారని కడప జిల్లాలో పర్యటిస్తున్నారు..?'

ABOUT THE AUTHOR

...view details