సీఎం జగన్ అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం - సీఎం జగన్
11:05 October 28
వచ్చే నెల 15, 16 తేదీల్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చ
ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ముఖ్యంగా సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో ప్రభుత్వం విక్రయించడంపై సినిమాటోగ్రఫీ, చట్టసవరణపై చర్చించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో చట్ట సవరణకు సిద్ధం చేసిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేయనున్నారు.
ఆలయాల్లో భద్రతకు సీసీ కెమెరాలు, ఇతర చర్యలకు ప్రత్యేకంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, ‘ఈడబ్ల్యూఎస్’ కేటగిరిలోని వారి సంక్షేమ కార్యకలాపాలకు ప్రత్యేకంగా ఓ శాఖ ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇలా దాదాపు 20 నుంచి 25 అంశాలపై మంత్రివర్గం చర్చించి ఆమోదముద్ర వేయనుంది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించే అవకాశముంది.
ఇదీ చదవండి: చైనా కొత్త చట్టంతో సరిహద్దులో శాంతి స్థాపనకు ముప్పు!