ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TS: పలువురు ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులకు పదోన్నతులు, బదిలీలు - తెలంగాణ వార్తలు

తెలంగాణ రాష్ట్రంలో చాలా ఏళ్ల తర్వాత అఖిల భారత సర్వీసు అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ఐఏఎస్​, ఐపీఎస్​లకు పదోన్నతులు, బదిలీలకు.. ప్రభుత్వం చాన్నాళ్ల తర్వాత శ్రీకారం చుట్టింది. త్వరలో బదిలీలు జరుగుతాయనే చర్చ పోలీస్ శాఖలో తరచూ వస్తూనే ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం వాయిదా వేస్తూ వచ్చింది. ఇప్పుడు క్రమంగా ఐపీఎస్​లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడుతున్నాయి. గత మూడు నాలుగేళ్లుగా ఒకే స్థానంలో ఉన్న అందరు ఐపీఎస్​లకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

TG
TG

By

Published : Aug 26, 2021, 9:31 AM IST

తెలంగాణలో ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారులు పదోన్నతులు, బదిలీల కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. పదోన్నతి లభించినా చాలామంది పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. అడపాదడపా ఒకరిద్దరు అధికారులను మాత్రమే ప్రభుత్వం బదిలీ చేస్తూ వచ్చింది. చాలామంది అధికారులు చాలా ఏళ్లుగా అదే పోస్టుల్లో పనిచేస్తున్నారు. ఐపీఎస్​ అధికారులకు పదోన్నతి లభించినా పాత పోస్టులోనే కొనసాగుతూ వచ్చారు. ఐఏఎస్​ అధికారుల్లో చాలా మంది అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొందరు అధికారులు మూడు, నాలుగు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఐఏఎస్​, ఐపీఎస్​ అధికారుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ గత రెండు రోజులుగా కొనసాగుతోంది. చాలా కాలంగా పెండింగ్​లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారుల పదోన్నతులు పూర్తయ్యాయి.

ముగ్గురు ఐఏఎస్​లకు పదోన్నతి

ముగ్గురు ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, హర్‌ప్రీత్ సింగ్, అర్వింద్ కుమార్‌లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. నలుగురు సీనియర్ ఐపీఎస్​లకు డీజీపీ హోదా లభించింది. అంజనీ కుమార్, గోవింద్ సింగ్, రవిగుప్తా, ఉమేష్‌షరాఫ్‌లకు డీజీ హోదా కల్పించారు. ఉమేష్‌షరాఫ్‌ను ప్రింటింగ్, స్టేషనరీ కమిషనర్‌గా నిఘావిభాగం అధిపతిగా అనిల్ కుమార్​ను నియమించారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్, పశ్చిమమండలం ఐజీ స్టీఫెన్ రవీంద్రకు స్థానచలనం కలిగింది. స్టీఫెన్ రవీంద్ర సైబరాబాద్ కమిషనర్‌గా, సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బదిలీ అయ్యారు. దీంతో చాన్నాళ్ల తర్వాత ఆర్టీసీకి పూర్తి స్థాయి ఎండీ వచ్చారు. తాజా బదిలీలతో కొన్ని పోస్టులు ఖాళీ కాగా పదోన్నతులతో స్థానభ్రంశం అనివార్యమైంది. అందుకు తగ్గట్లుగా మరికొన్ని బదిలీలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐఏఎస్​ అధికారులకు సంబంధించి మరికొంతమందికి పదోన్నతులు దక్కుతాయని, బదిలీలు ఉంటాయని సమాచారం. కొందరు అధికారులకు ఉన్న అదనపు బాధ్యతలు తప్పించడంతో పాటు వెయిటింగ్‌లో ఉన్న అధికారులకు పోస్టింగులు ఇస్తారన్న చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది.

మరింత మంది బదిలీ

డీజీపీ హోదాలో ఉన్న గోపికృష్ణ గత నెల పదవీ విరమణ పొందారు. అనిశా డీజీ పూర్ణచందర్ రావు ఈ నెల పదవీవిరమణ పొందనున్నారు. జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేదీ వచ్చే నెలలో పదవీవిరమణ పొందుతారు. వారిస్థానాలను ప్రస్తుతం పదోన్నతి పొందిన డీజీపీలతో భర్తీ చేసే అవకాశం ఉంది. రాచకొండ కమిషనర్ మహేశ్‌ భగవత్‌ బదిలీ అయ్యే అవకాశముంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఏఆర్​ శ్రీనివాస్, రమేశ్ రెడ్డి, విశ్వప్రసాద్ డీఐజీలుగా పదోన్నతి పొంది రెండేళ్లు దాటినా.. సీపీ స్థానాల్లోనే కొనసాగుతున్నారు. వారిని ప్రభుత్వం బదిలీ చేసే అవకాశం ఉంది

ఇదీ చదవండి: CJI Ramana: ఛార్జిషీట్‌ దాఖలుకు 10-15 ఏళ్లా?

ABOUT THE AUTHOR

...view details