ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యూ ఇయర్ జోష్... ఒక్కరోజే రూ.116 కోట్లు తాగేశారు.. - నూతన సంవత్సర మద్యం ఆదాయం ఆంధ్రప్రదేశ్​

రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకల్లో మద్యం పోటెత్తింది. డిసెంబర్​ 31 న రూ.116 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగినట్లు తెసుస్తోంది. గతేడాదితో పోల్చుకుంటే అమ్ముడైన సరకు పరిమాణం తక్కువగానే ఉన్నప్పటికీ ... మద్యం ధరలు పెరగడం వల్ల ఖజానాకు ఆదాయం భారీగా సమకూరింది.

by liquir sales ap govt got rs 116 crores with in a day
ఒక్కరోజే రూ.116 కోట్ల విక్రయం

By

Published : Jan 2, 2021, 6:39 AM IST

Updated : Jan 2, 2021, 12:17 PM IST

కొత్త సంవత్సర స్వాగత వేడుకల్లో మద్యం ఏరులై పారింది. డిసెంబరు 31న రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బుల్లో రూ.116కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. ఈ ఒక్కరోజే లక్ష కేసులకు పైగా మద్యాన్ని, 46 వేల కేసుల బీర్లు విక్రయించారు. డిసెంబరు 30, 31 రెండు రోజుల్లో కలిపి విక్రయాలు రూ. 199.52 కోట్లు దాటాయి. సాధారణ రోజుల్లో సగటున రూ. 70 నుంచి 75 కోట్ల విలువైన మద్యం అమ్ముడవుతోంది.

గురువారం దానికంటే 65.71 శాతం అధికంగా విక్రయవైంది. 2019 డిసెంబర్​ అమ్మకాలతో పోలిస్తే ఈ సారి అమ్ముడైన సరకు పరిమాణం తగ్గినప్పటికీ మద్యం ధరలు పెరగటంతో ఆదాయం సైతం పెరిగింది. విశాఖ జిల్లాలో అత్యధికంగా రూ. 10.78కోట్లు విలువైన మద్యం అమ్ముడైంది. గుంటూరు జిల్లాలో రూ.10.56 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ. 10.11 కోట్ల విలువైన సరుకు విక్రయించారు. అనంతపురం జిల్లాలో అతి తక్కువగా రూ. 2.98 కోట్ల విక్రయాలు జరిగాయి.

Last Updated : Jan 2, 2021, 12:17 PM IST

ABOUT THE AUTHOR

...view details