తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. సత్తుపల్లి శివారులో ఈ గాలులకు రోడ్డు పక్కన నిలిపిన ప్రైవేటు బస్సు ఒక్కసారిగా వెనక్కి జరిగింది. దాదాపు 200 మీటర్లు వెళ్లాక.. చెట్టును ఢీకొట్టి అక్కడ ఆగిపోయింది.
ఆ బస్సుకు గాలే డ్రైవర్! - bus moved backwards because of heavy winds
ఆ బస్సులో డ్రైవర్ లేడు.. కానీ ఆ బస్సు 200 మీటర్లు వెనక్కి వెళ్లింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో శనివారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు రోడ్డు పక్కన నిలిపిన ఓ ప్రైవేటు బస్సు పరిస్థితి ఇది.
గాలికి నడిచిన బస్సు
బస్సు వెనక్కి వెళ్తునప్పుడు.. మధ్యలో ఎలాంటి వాహనాలు రాకపోవడం, బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. మరోవైపు కల్లూరులోని ఓ ఇంటి సమీపంలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడి.. చెట్టు మంటలకు ఆహుతైంది.