అందరూ పండుగ సందర్భంగా సంతోషంగా ఇంటికి బయలుదేరారు. తమ వారిని కలుసుకుంటామనే ఆనందంలో నిద్రకు ఉపక్రమించారు. కానీ.. అంతలోనే ప్రమాదం. ప్రాణనష్టం జరగకపోయినా.. ప్రాణం పోతుందనే భయం వారిని వెంటాడింది. ఆర్టీసీ బస్సు (BUS ACCIDENT) బోల్తా పడిన ఘటనలో.. 20 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం వద్ద చోటు చేసుకుంది.
ఏపీఎస్ ఆర్టీసీ బస్సు(BUS ACCIDENT) హైదరాబాద్ నుంచి కర్నూల్ వస్తుండగా.. ఈ గుర్ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 20 మంది గాయపడగా.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లనే ఈ ప్రమాదం (BUS ACCIDENT) చోటు చేసుకుందని ప్రయాణికులు ఆరోపించారు. ఎవరికీ ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.