ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గవర్నర్​కు బడ్జెట్ ఆర్డినెన్స్‌.. ఆమోదం తర్వాత నోటిఫికేషన్

By

Published : Mar 26, 2021, 10:58 PM IST

రాష్ట్ర బడ్జెట్ ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషణ్‌కు పంపింది. గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది. రూ.90 వేల కోట్ల వరకు బడ్జెట్ ఆర్డినెన్సును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ పెట్టడం జగన్ పలాయనవాదమని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.

గవర్నర్​కు బడ్జెట్ ఆర్డినెన్స్
గవర్నర్​కు బడ్జెట్ ఆర్డినెన్స్

రాష్ట్ర బడ్జెట్ ఆర్డినెన్స్‌ను గవర్నర్ బిశ్వభూషణ్‌కు ప్రభుత్వం పంపించింది. బడ్జెట్ ఆర్డినెన్స్‌ను శనివారం గవర్నర్ ఆమోదించే అవకాశం ఉంది. గవర్నర్ ఆమోదించాక ఆర్డినెన్స్‌పై ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వనుంది.

రూ.90 వేల కోట్ల వరకు బడ్జెట్ ఆర్డినెన్సును రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ఆన్‌లైన్ ద్వారా పంపిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్సుకు మంత్రుల ఆమోదం తెలిపారు. సీఎం పరిశీలన అనంతరం మంత్రులకు దస్త్రాన్ని ఆర్థికశాఖ పంపింది.

ప్రతిపక్షాల విమర్శలు..

ఆర్డినెన్స్ రూపంలో బడ్జెట్ పెట్టడం జగన్ పలాయనవాదమని తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. బడ్జెట్ కూడా ఆర్డినెన్స్ రూపంతో ఆమోదం పొందే సంప్రదాయమా.. అని ప్రశ్నించారు. దుష్టసంప్రదాయాన్ని జగన్‌ తీసుకొచ్చారని యనమల ధ్వజమెత్తారు. ఏ రాష్ట్రంలోనూ ఏదో ఒక వంక చూపి బడ్జెట్ వాయిదా వేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు లేదా ఓటాన్ అకౌంట్ పెట్టాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... ఏపీ నూతన ఎస్‌ఈసీగా నీలం సాహ్ని

ABOUT THE AUTHOR

...view details