శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బడ్జెట్ ప్రవేశపెట్టుబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. బడ్జెట్ అందరికీ మేలు చేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకిచ్చిన ప్రతిమాట నిలబెట్టుకునేలా బడ్జెట్ రూపకల్పన చేసినట్లు పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి సంక్షేమం ప్రతిబింబించేలా ఉంటుందన్నారు.
ప్రజలకిచ్చిన ప్రతిమాట నిలబెట్టుకునేలా బడ్జెట్ రూపకల్పన: హరీశ్‌రావు - telangana budget news
బడ్జెట్ అందరికీ మేలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో శాసన సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలిపారు.
ప్రజలకిచ్చిన ప్రతిమాట నిలబెట్టుకునేలా బడ్జెట్ రూపకల్పన: హరీశ్‌రావు
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తితిదే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మంత్రి హరీశ్‌రావు వెళ్లారు. ఆలయ ప్రథమ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చాలా బాగుందని ప్రశంసించారు. తెలంగాణ ప్రజలకు స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.