పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేస్తామని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. అవసరమైతే ప్రాణాలు అర్పించేందుకైనా సిద్ధమని స్పష్టం చేశారు. రాత్రికి రాత్రే పోలీసులు తమ ఇళ్లకు నోటీసులు అంటించడాన్ని ఆక్షేపించారు. ప్రభుత్వ వైఖరిని అన్ని వర్గాల ప్రజలూ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు.
'ఎన్ని ఆంక్షలున్నా.. అసెంబ్లీని ముట్టడిస్తాం' - అసెంబ్లీ ముట్టడిపై బుద్దా వెంకన్న వ్యాఖ్యలు
రేపు జరగబోయే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఎవరూ ఆపలేరని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఎన్ని ఆంక్షలున్నా భారీ ర్యాలీతో వెళ్లీ అసెంబ్లీని ముట్టడిస్తామని స్పష్టం చేశారు.
బుద్దా వెంకన్న