వైకాపా ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని తెలుగుదేశం ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాల్గొనగా వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్‌ల కోసం 43 లక్షల 44 వేల రూపాయలు స్వాహా చేశారని ఆయన ఆరోపించారు.
'వాటర్ బాటిళ్లు, మజ్జిక ప్యాకెట్లకు రూ.43.44 లక్షలా.. ఇదేం దోపిడీ?' - వాటర్ బాటిళ్లకు లక్షలు పెట్టారని బుద్ధా వెంకన్న ఆరోపణలు
వైకాపా ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని తెదేపా నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. సీఎం సమావేశంలో వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లకు రూ.43.44 లక్షలు దుబారా ఖర్చు చేశారని విమర్శించారు. చంద్రబాబుపై విమర్శలు చేసిన వైకాపా ... ఇప్పుడేం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు.
తెదేపా నేత బుద్దా వెంకన్న
చంద్రబాబు సొంత ఖర్చులతో వాటర్ బాటిల్ తెచ్చుకుంటేనే గోల చేసిన వైకాపా ఇప్పుడు ప్రజా ధనం దుబారాకి ఏంసమాధానం చెబుతుందని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. జగన్ ప్రమాణ స్వీకారానికి అయిన ఖర్చుకు ఇప్పటికీ డబ్బులు విడుదల చేస్తూనే ఉన్నారని విమర్శించారు. ప్రజాధనం దుర్వినియోగంపై జగన్ సమాధానం చెప్పాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :తెదేపా కార్యకర్తకు చంద్రబాబు ఫోన్‌కాల్.. ఎందుకంటే?!