వివేకా హత్యకేసును తప్పుదారి పట్టిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. హత్య కేసు దర్యాప్తులో ఇంత ఆలస్యమెందుకని ప్రశ్నించారు. మంగళగిరి తెదేపా జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివేకా హత్యకేసు సీబీఐకి అప్పగించడంలో ఎందుకింత జాప్యం జరుగుతోందని నిలదీశారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె స్వయంగా ... వైఎస్ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిపై అనుమానం ఉందని చెబితే.. వారినెందుకు కస్టడీలోకి తీసుకోవట్లేదని ప్రశ్నించారు. అధికారం ఉందని తెదేపా నేతలను వేధించడం మంచి పద్ధతి కాదని బుద్ధా వెంకన్న అన్నారు. సీఎం జగన్ మడమ తిప్పని నాయకుడైతే వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరారు.
వివేకా హత్యకేసులో ఆయనే సూత్రధారి : బుద్ధా వెంకన్న - వివేకా హత్యపై బుద్ధా వెంకన్న కామెంట్స్
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వివేకా హత్యకేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేసిన జగన్... ఇప్పుడెందుకు కేసును సీబీఐకి ఇవ్వడం లేదని తెదేపా నేత బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె స్వయంగా పలువురిపై అనుమానం ఉందని చెప్పినా.. వారినెందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. సీఎం జగన్ మడమతిప్పని నాయకుడైతే... కేసును సీబీఐకి అప్పగించాలని సవాల్ చేశారు.
బుద్ధా వెంకన్న
ఇదీ చదవండి :సీబీఐకి ఎందుకు అప్పగించట్లేదు?: వివేకా కుమార్తె