తెలంగాణలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్డు మార్గమధ్యలో కొండరాళ్లు కూలాయి. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ చేయడం వల్ల, వరుసగా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మార్గంలో అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు. మొదటి ఘాట్ రోడ్డు ద్వారా భక్తులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలను కొండపైకి అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి: