ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కృష్ణా జలాల వివాదం.. నేటి నుంచి బ్రిజేష్‌ ట్రైబ్యునల్ విచారణ - నేటి నుంచి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్ విచారణ

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జిలాల వివాదం రగులుతూనే ఉంది. ఈ క్రమంలో నేటి నుంటి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్.. ఈ సమస్యపై విచారణ చేపట్టనుంది. తెలంగాణకు ఎక్కువ నీటిని కేటాయించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ.. సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్‌ ఘనశ్యాంజా సాక్షిగా అఫిడవిట్‌ దాఖలు చేశారు. దీనిపై ట్రైబ్యునల్ తీర్పు చెప్పనుంది.

Brijesh Kumar
Brijesh Kumar

By

Published : Mar 17, 2021, 8:47 AM IST

కృష్ణా జలాల వివాదం పరిష్కారానికి బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటైంది. నేటి నుంచి తెలుగు రాష్ట్రాల వాదనలపై ట్రైబ్యునల్ విచారణ చేపట్టనుంది. 2019 ఆగస్టు తర్వాత తొలిసారి ట్రైబ్యునల్‌ సమావేశం నిర్వహించనుంది.

తెలంగాణకు ఎక్కువ నీటిని కేటాయించాల్సిన అవసరాన్ని పేర్కొంటూ దాఖలైన ఓ అఫిడవిట్‌ కు సంబంధించి వాదనలు జరగనున్నాయి. ఏపీ తరఫు న్యాయవాది ఈ విషయంలో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనున్నారు. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపుపై ట్రైబ్యునల్‌ తీర్పు చెప్పనునుంది.

ABOUT THE AUTHOR

...view details