తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 31 వరకు లాక్‌డౌన్ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇంటి అవసరాల కోసం కావాల్సిన పాలు, కూరగాయల కోసం మాత్రమే బయటకు రావాలని సూచించారు. బయటకు వచ్చిన వ్యక్తులు పక్కవారితో మూడు అడుగుల దూరం పాటించాలని చెప్పారు.
కరోనా ఎఫెక్ట్: మార్చి 31 వరకు తెలంగాణలో లాక్‌డౌన్
కరోనా ప్రభావం నేపథ్యంలో ఈ నెలాఖరు వరకు తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
తెలంగాణ
ఒక్కో రేషన్ కార్డుకు 12 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. 3.36 లక్షల టన్నుల బియ్యం ఉచితంగా సరఫరా చేస్తామని తెలిపారు. బియ్యంతో పాటు ప్రతి రేషన్‌కార్డుకు రూ.1500 నగదు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
TAGGED:
BREAKINK