తెలంగాణలో దారుణం.. తహశీల్దార్ సజీవ దహనం - undefined
![తెలంగాణలో దారుణం.. తహశీల్దార్ సజీవ దహనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4955814-thumbnail-3x2-darunam.jpg)
14:43 November 04
14:28 November 04
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సజీవ దహనం
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో దారుణం జరిగింది. పట్టపగలు.. అంతా చూస్తుండగానే... తహశీల్దార్ విజయను దుండగులు సజీవ దహనం చేశారు. ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. మంటలు అదుపు చేసే క్రమంలో ఇద్దరి సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన స్థితిలో.. విజయ చనిపోయారు.
జనం తక్కువగా ఉన్న సమయంలో అదును చూసి...
తహశీల్దార్ కార్యాలయంలో జనం తక్కువగా ఉన్న సమయం చూసి ఆగంతకుడు రెచ్చిపోయాడు. అదును చూసి మరీ దాడికి దిగాడు. సంచితో లోనికి వచ్చినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. భోజన సమయంలో దాడి చేశాడన్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. దాడి తీరుపై దర్యాప్తు చేస్తున్నారు.
TAGGED:
breaking