సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మల్లికార్జున నగర్‌కు చెందిన భద్రయ్య అనే వ్యక్తి తన ఇంటి ఆవరణలో బ్రహ్మ కమలం మొక్క నాటారు. ప్రతి ఏడాది బ్రహ్మకమలాలు పూస్తున్నా... ఈ ఏడాది మాత్రం ఒకేసారి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 కమలాలు పూశాయి. శివుడికి అత్యంత ఇష్టమైన ఈ బ్రహ్మకమలాలు తమ ఇంటి ఆవరణలో విరబూయడం చాలా సంతోషంగా ఉందని భద్రయ్య తెలిపారు. తొమ్మిది సంవత్సరాల నుంచి పెంచుతున్నా... ఎప్పుడు ఇంత ఎక్కువగా పూయలేదని వెల్లడించారు. వీటిని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు.
తెలంగాణ: సంగారెడ్డిలో విరబూసిన 30 బ్రహ్మకమలాలు - 30-brahma kamalam flowers
హిమాలయాల్లో ఏడాదికి ఒక్కసారి విరబూసే బ్రహ్మకమలాలు... మనముండే ప్రాంతంలో పూస్తే... ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా 30 పూలు అందంగా దర్శనమిస్తుంటే.. ఆ అనుభూతి చెప్పలేము. ఈ మధురమైన ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది.

సంగారెడ్డిలో విరబూసిన 30 బ్రహ్మకమలాలు