ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంతోత్సవం - vasanthotsavam in bhadradri temple

భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంత పక్ష తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి వల్ల భక్తులెవరూ లేకుండానే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మణసమేత సీతారాములకు అర్చకులు వసంతోత్సవం జరిపారు.

badadri
భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంతోత్సవం

By

Published : Apr 26, 2021, 11:04 PM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో వసంతోత్సవం

కరోనా వ్యాప్తి వల్ల తెలంగాణలోని భద్రాద్రి రామయ్య సన్నిధిలో బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. వసంత పక్ష తిరుకల్యాణ ఉత్సవాల్లో భాగంగా నేడు లక్ష్మణ సమేత సీతారాములకు బేడా మండపంలో అర్చకులు వసంతోత్సవం నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు.

హరిదాసులు.. భక్తరామదాసు రచించిన కీర్తనలను స్వామి వారి ముందు ఆలపించారు. ముందుగా వసంతానికి పూజలు చేసి ప్రధానాలయంలోని మూలవరులకు, బేడా మండపంలోని ఉత్సవ మూర్తులకు వసంతాన్ని చల్లి వసంతోత్సవం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details