పీజీ పరీక్షలు డిసెంబరు 15 నుంచి జనవరి వరకు నిర్వహించేలా తెలంగాణలోని బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ పీజీ కోర్సులతో పాటు.. బీఎల్ఐసీ, ఎంఎల్ఐసీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు డిసెంబరు 15 నుంచి నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.
డిసెంబరు 15 నుంచి అంబేడ్కర్ వర్సిటీలో పీజీ పరీక్షలు - ambedkar open univercity exams from december 15th
తెలంగాణలోని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిసెంబర్ 15 నుంచి పీజీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. విద్యార్థులు ఈనెల 25లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పరీక్షకు రెండు రోజుల ముందు యూనివర్సిటీ పోర్టల్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు.

డిసెంబరు 15 నుంచి అంబేడ్కర్ వర్సిటీలో పీజీ పరీక్షలు
పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఈనెల 25లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. పరీక్షకు రెండు రోజుల ముందు విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braouonline.in నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. అధ్యయన కేంద్రం, వెబ్ సైట్, హెల్ప్‌డెస్క్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.