ఆన్‌లైన్‌లో ఒకబ్బాయి పరిచయమయ్యాడు. ఆరునెలల్లో బాగా దగ్గరయ్యాం. నా ప్రతి అవసరం తీర్చుతాడు. విపరీతమైన ప్రేమ చూపిస్తాడు. కానీ ఈ మధ్య.. న్యూడ్ ఫొటోలు పంపమంటున్నాడు. వీడియో కాల్స్ మాట్లాడమంటాడు. ఇదంతా రొమాన్స్‌లో భాగం అంటున్నాడు. తనది నిజమైన ప్రేమా? నన్ను మోసం చేయాలనుకుంటున్నాడా? అర్థం కావడం లేదు? - జీఎస్‌ఆర్, ఈమెయిల్
మనం ప్రేమించే వ్యక్తిపై మనకు చాలా నమ్మకం ఉంటుంది. వారు మనల్ని మోసం చేయరని, ఎప్పటికీ మనతోనే కలిసి ఉంటారని నమ్ముతుంటాం. అందరి జీవితాలు ఇలా ఉండవు. కొంతమంది మోసపోతుంటారు. ఇది జరగకుండా ఉండాలంటే మనం ఎలాంటి రిలేషన్‌లో ఉన్నామో గుర్తించాలి. టాక్సిక్ రిలేషన్‌షిప్ అనిపిస్తే వెంటనే బయటపడాలి.
'న్యూడ్ వీడియో లీక్.. కాలు బయట పెట్టలేకపోయా!'
మీ విషయానికొస్తే మీ భాగస్వామికి మిమ్మల్ని మోసం చేసే ఉద్దేశం ఉంటే ముందే గుర్తించవచ్చు. తన సామాజిక మాధ్యమ ఖాతాలను ఓసారి గమనించండి. తన స్నేహితులు, పోస్ట్‌లు, ఎలా ఉన్నాయో పరిశీలించండి. వీటన్నింటి ఆధారంగా ఓ అంచనాకు రావచ్చు. సోషల్ మీడియాలోనే కాదు.. బయట అతడు ప్రవర్తించే పద్ధతితో కూడా మనస్తత్వాన్ని అంచనా వేయొచ్చు. మీరు ఎంత దగ్గరైనా న్యూడ్ ఫోటోలు పంపించమంటున్నాడంటే కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే! వయసు చేసే అలజడితో తను అలా అడిగి ఉండొచ్చు. కాబోయే జీవిత భాగస్వామే కదా అని మీరు పంపించడానికి సిద్ధపడి ఉండొచ్చు.