ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Boy died in Mulugu: నీళ్లు అనుకొని పురుగులమందు తాగి.. బాలుడు మృతి - తెలంగాణ నేర వార్తలు

మంచినీళ్లనుకొని ఓ బాలుడు పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఈ ఘటన తెలంగాణలోని ములుగు జిల్లా తొగుబోరులో చోటుచేసుకుంది.

boy-dies-after-drinking-pesticide-at-mulugu
నీళ్లు అనుకొని పురుగులమందు తాగి.. బాలుడు మృతి

By

Published : Dec 15, 2021, 4:02 PM IST

Boy died in Mulugu : తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం తొగుబోరులో విషాదం నెలకొంది. ఓ బాలుడు మంచినీరు అనుకొని సీసాలోని పురుగులమందు తాగాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు... బాలుడు సురేశ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు.

అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు... విగత జీవిగా పడి ఉండడం చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంచినీళ్లు అనుకొని పురుగుల మందు తాగి... బాలుడు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:Shilpa Chowdary Cheating Case: శిల్పాచౌదరికి 14 రోజుల రిమాండ్ విధించిన ఉప్పర్‌పల్లి కోర్టు

ABOUT THE AUTHOR

...view details