రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి రైతుల ఉద్యమంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 500 కాదు వెయ్యి రోజులు ఉద్యమం చేయండి.. ఎవరు వద్దన్నారని వ్యాఖ్యానించారు. కోర్టులకు వెళ్లడం వల్లే అమరావతిలో ప్లాట్ల అభివృద్ధి ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న బొత్స.. అమరావతిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామని చెప్పారు.
వర్క్ ఫ్రం హోం సాధ్యపడదు..