ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు: బొత్స - Botsa On Palnadu Issue

క్షేత్రస్థాయిలో సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. చిన్న చిన్న తగాదాలను భూతద్దంలో పెట్టి పెద్దవి చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : Sep 12, 2019, 5:36 PM IST

మంత్రి బొత్స సత్యనారాయణ

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆలోచనల ప్రకారమే రాష్ట్రంలో పాలన సాగుతోందని... పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చిన్న చిన్న తగాదాలను భూతద్దంలో పెట్టి పెద్దవి చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పల్నాడులో బలహీనవర్గాలపై దాడులను చూశామన్న మంత్రి బొత్స... అక్రమ కార్యకలాపాల పరిశీలనకూ ఆనాడు ఎవరూ వెళ్లనీయలేదన్నారు.

గత ప్రభుత్వ, ఈ ప్రభుత్వ పాలనలో కలెక్టర్ల సమావేశాన్ని బేరీజు వేసుకోవాలని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. గతంలో కార్యకర్తలు ఎలా చెబితే అలాగే చేయాలనే విధంగా ఉపన్యాసాలు ఉన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టాలకు లోబడి నడుచుకోవాలని సీఎం జగన్‌ చెప్పినట్లు వివరించారు.

స్పందన కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సమస్యల పరిష్కారం చేస్తున్నామన్న బొత్స... సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఇంటింటికీ చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు గ్రామ వాలంటీర్ల నియామకాలు జరుగుతున్నాయని చెప్పారు.

ఇదీ చదవండి

'ఒక్క రూపాయి దుర్వినియోగం కావొద్దు'

ABOUT THE AUTHOR

...view details