రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్తామని బొత్స స్పష్టం చేశారు.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ - ap political news
త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు.

బొత్స సత్యనారాయణ