ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'దేశంలో ఎక్కడాలేని విధంగా నమూనాలు సేకరిస్తున్నాం' - botsa satyanarayana on babu

కరోనాపై ప్రభుత్వం లోతుగా సమీక్ష చేసిందని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. క్షేత్రస్థాయిలో తీసుకునే జాగ్రత్తలపై అధికారులకు సూచనలు చేసినట్టు తెలిపారు. కేంద్రం సూచనల మేరకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

botsa satyanarayana angry over babu comments
మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : Apr 17, 2020, 7:56 PM IST

మంత్రి బొత్స సత్యనారాయణ

ప్రస్తుతం రోజుకు 2 వేల మందికి కరోనా పరీక్షలు చేసే సామర్థ్యం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. 10 నిమిషాల్లో పరీక్షలు చేసేందుకు లక్ష కిట్లు తెప్పించామని చెప్పారు. మ్యాపింగ్ చేసిన ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేస్తున్నామన్న బొత్స... దేశంలో ఎక్కడాలేని విధంగా నమూనాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.

విశాఖలో కేసుల సంఖ్య దాస్తున్నామని తెదేపా విమర్శలు చేస్తోందన్న బొత్స సత్యనారాయణ... ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. వలస కార్మికులకు షెల్టర్లు ఏర్పాటు చేశామని వివరించారు. నడిచి వెళ్లే వలస కార్మికులకు ఆశ్రయం కల్పిస్తామని ఉద్ఘాటించారు. ప్రజలందరికీ వారంలోగా మాస్కుల పంపిణీ చేస్తామని మంత్రి బొత్స చెప్పారు.

ఇదీ చదవండీ... 'కరోనా కేసులపై ప్రభుత్వ హెల్త్ బులెటిన్లు బోగస్'

ABOUT THE AUTHOR

...view details