.
'రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా గడ్డం పట్టుకుని బతిమిలాడుతాం'
రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే ఎన్డీయేలో కూడా చేరతామని.. ఎవరినైనా గడ్డం పట్టుకుని బతిమిలాడే స్థాయికైనా దిగుతామని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. భాజపాతో తాము అంటిపెట్టుకుని ఉండటం లేదని.. అలాగని వారికి దూరంగానూ లేమని తెలిపారు. విశాఖలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడిన ఆయన.. ఈ విషయమై మీడియా ప్రశ్నలకు స్పందించారు. కేంద్ర ప్రభుత్వంతో అనవసరంగా ఎందుకు ఘర్షణ పడాలని అన్నారు.
అవసరమైతే ఎవరినైనా గడ్డం పట్టుకుని బతిమిలాడుతాం : మంత్రి బొత్స
Last Updated : Feb 15, 2020, 7:57 AM IST