వైకాపా అవసరమైతే ఎన్డీయేతో చేరుతుందని తాను ఎక్కడా అనలేదని మంత్రి బొత్స అన్నారు. రాజకీయ పార్టీలుగా ఎవరి భావాలు వారికి ఉంటాయన్న ఆయన.. తాను ఆ మాటలు ఎక్కడ అన్నానో చూపించాలని ఓ బహిరంగ లేఖ రాశారు. విశాఖలోని వైకాపా నగర కార్యాలయంలో శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలపై విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ సారాంశం ఇదే..!
ఘర్షణ ఎందుకు పడాలి
కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు ఘర్షణ పడాలి అని ఆ సమావేశంలో బొత్స ప్రశ్నించారు. అవసరమైతే, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలకు ఏమైనా ఇబ్బంది వస్తే తప్పనిసరిగా డిమాండు చేస్తానని అన్నారు. అంతేగానీ రోజూ దాని గురించి కార్యక్రమం కరెక్ట్ కాదు కదా అని వ్యాఖ్యానించారు.