బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ)
బోస్టన్ గ్రూప్ ఇక్కడిది కాదు. అమెరికాకు చెందిన సంస్థ. 1963లో స్థాపించారు. తర్వాత 50 దేశాలకు ఈ కంపెనీ విస్తరించింది. మెుత్తం దీనికి 90 బ్రాంచీలు ఉన్నాయి. ఈ కంపెనీ సీఈవో రిచ్ లెసర్. ఆయా దేశాలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రాజెక్టులను రూపొందించడం, సలహాలు, సూచనలు ఇవ్వడం బోస్టన్ గ్రూప్ పని.
అసలేంటా 'బోస్టన్' కన్సల్టింగ్ గ్రూప్..? - రాజధానిపై బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ న్యూస్
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. కేబినెట్ మీటింగ్‌లో ఈ కంపెనీ పేరు ప్రస్తావించిన తర్వాత.. అసలేంటా బోస్టన్ గ్రూప్ అనే ప్రశ్నలొస్తున్నాయి. జీఎన్‌రావు కమిటీ ఇచ్చిన నివేదికపైనా.. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఇచ్చే నివేదికపైనా హైపవర్ కమిటీ పరిశీలించనుందన్న వార్తతో 'బీసీజీ' పేరు హైప్ అయింది. ఇంతకీ బోస్టన్ గ్రూప్ ఎక్కడిది..? అది చేసే అధ్యయనం ఏంటీ..?
bostan consulting group company gave report on capital amaravathi
పలు నిర్మాణాలు, మౌలిక సదుపాయల కల్పనపైనే ఇంతవరకు బోస్టన్ కంపెనీ సలహాలు, సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పాలనాపరమైన అంశంపై ఈ కంపెనీ నివేదిక ఇవ్వనుంది.
ఇదీ చదవండి: జనవరి మూడు తర్వాతే రాజధానిపై తుది నిర్ణయం
Last Updated : Dec 28, 2019, 5:10 PM IST